రాష్ట్రంలో 24 గంటల్లో 965 కరోనా కేసులు..

196
corona in ts
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువయ్యాయి. గత 24 గంటల్లో 965 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,741కి చేరగా 3,01,876 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,159 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1706 కి చేరింది.

గత 24 గంటల్లో జీహెచ్ఎంసీలో 254, మేడ్చల్‌లో 110, రంగారెడ్డిలో 97, నిజామాబాద్‌లో 64, నిర్మల్‌లో 39, జగిత్యాల్‌లో 35 కేసులు నమోదు అయ్యాయి.

- Advertisement -