మార్చి 26 నుంచి 29 వరకు తమిళ నాడులో జరిగిన 4వ జాతీయ స్థాయి ఫిస్ట్ బాల్ లో ఛాంపియన్స్ గా నిలిచిన తెలంగాణ జట్టును రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. వారి క్రీడా నైపుణ్యాన్ని మెచ్చు కున్నారు. భవిష్యత్తులోనూ మంచి క్రీడా స్ఫూర్తి తో మెలగాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. కాగా జాతీయ జట్టు లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన 4గురు ఆటగాళ్ళు ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లా నుంచి ముగ్గురు, హైదారాబాద్ నుంచి ముగ్గురు ఉండటం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు, క్రీడాకారులకు మంచి ఆదరణ లభిస్తున్నది అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సీఎం అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. బాగా రాణించాలని క్రీడాకారులకు సూచించారు. ఒక్కొక్క క్రీడాకారుడు తోను ఒక్కో ఫోటో దిగి వారిని ఉత్సాహపరిచారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర టీం లో ఒక్క పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు గ్రామం నుంచే 4గురు క్రీడా కారులు ఉన్నారు. వీరిలో బాలబోయిన సందీప్, జోడు సంతోష్, రావుల కుమార స్వామి, దొంతమల్ల గణేశ్ లు ఉండగా, మహబూబాబాద్ జిల్లా అమనగల్లు గుండాల గడ్డ తండాకు చెందిన లునావత్ సంతోష్ కెప్టెన్ గా, మహేందర్ లునావత్, శ్రీకాంత్ లు టీమ్ సభ్యులుగా ఉన్నారు. అలాగే, హైదరాబాద్ కు చెందిన మండల ఆనంద్, రాహుల్, రాజేశ్ లు టీమ్ సభ్యులు గా ఉన్నారు.
కాగా, తెలంగాణ స్టేట్ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మండలి విజయ్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము వెంకట్ తదితరుల ప్రోత్సాహంతో తాము ఎదిగామని, వాళ్లకు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి క్రీడాకారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.