కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత..

226
mlc kavitha
- Advertisement -

నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -