‘టక్ జగదీష్’ పరిచయ వేడుక..

197
Tuck Jagadish Parichaya Veduka
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టక్ జగదీష్ పరిచయ వేడుక కార్యక్రమాన్ని రాజమండ్రిలో చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాని, శివ నిర్వాణ, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌లు పాల్గొన్నారు.

ఏప్రిల్ 23న సెలెబ్రేషన్స్ చేసుకోబోతోన్నాం..
నరేష్ మాట్లాడుతూ.. ‘చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఇక్కడ పెద్దవాళ్లున్నారు. కొంతే మాట్లడతాను. మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన యంగ్ ఎంపీ భరత్ గారికి థ్యాంక్స్. డైనమిక్ యంగ్ హీరో నానితో భలే భలే మగాడివోయ్ సినిమాతో మా ప్రయాణం మొదలైంది. నాని అద్భుతమైన నటుడు. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ మా అందరి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు. టక్ జగదీష్ అనే టైటిల్ షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది కదూ.. సినిమా కూడా అలానే ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ మూవీ రాబోతోంది. నన్ను కూడా కొత్త పాత్రలో చూడబోతోన్నారు. ఏప్రిల్ 23న సెలెబ్రేషన్స్ చేసుకోబోతోన్నాం’ అని అన్నారు.

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా..
శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల నుంచి ఈ కథకు సపోర్ట్ ఇస్తున్న నా నిర్మాతలకు థ్యాంక్స్. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. అందరి సపోర్ట్ ఉండటం వల్లే ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాను కోవిడ్ తరువాత కూడా చేశాను. జగపతి బాబు, నానిలను అన్నాదమ్ములుగా చూడటం ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుంది. మీ ఇంటి అబ్బాయిలా కనిపిస్తాడు. నిన్ను కోరి సినిమాలో రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కానీ ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సినిమా గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. కానీ ఒక్క డైలాగ్ చెబుతాను. కొందరికి కుల పిచ్చి ఉంటుంది.. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది.. కానీ నాకు కుటుంబం అంటే పిచ్చి. ఇదే టక్ జగదీష్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నాని గారితో సినిమా చేసిన ప్రతీసారి నేర్చుకుంటాను. నాని గారంటే నాకు గౌరవం, ప్రేమ. ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను’ అని అన్నారు.

మంచి పేరు తీసుకురావాలి..
మంత్రి భరత్ మాట్లాడుతూ.. ‘రాజమండ్రిని తెలుగు ఇండస్ట్రీకి హబ్‌లా చేసేందుకు ప్రయత్నిస్తాను. మా అమ్మకు నాని అంటే చాలా ఇష్టం. సినిమా అందరూ చూడండి. ఈ సినిమా హిట్ అవ్వాలి. ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సక్సెస్ మీట్‌లో తప్పకుండా మాట్లాడతాను..
సాహూ గారిపాటి మాట్లాడుతూ.. ‘ఈ వేడుకకు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. సక్సెస్ మీట్‌లో తప్పకుండా మాట్లాడతాను’ అని అన్నారు.

అభిమానులు గర్వపడేలా చేస్తాను..
నాని మాట్లాడుతూ.. ‘ఈ క్రౌడ్, సౌండ్‌ను చాలా మిస్ అయ్యాను. ఏడాది నుంచి మీ(అభిమానులు) అందరినీ మిస్ అయ్యాను. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కానీ మళ్లీ పాత రోజులు వచ్చేశాయ్. కాకపోతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ ఇక్కడ ఫిక్స్ చేశాక వస్తున్నా రాజమండ్రి అని పోస్ట్ పెట్టాను. అయితే శ్యాం సింఘరాయ్ షూటింగ్ కోసం వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. ఓ సారి షూటింగ్ కోసం వెళ్తుంటే ఓ అభిమాని.. ‘నాని గారు మీకు నేను పెద్ద ఫ్యాన్‌ని.. నాతో సెల్ఫీ దిగకపోతే.. షూటింగ్ జరగనివ్వను’ అని వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచంలో ఒక వార్నింగ్‌ను కూడా అంత ప్రేమగా ఇవ్వగలిగేది ఒక్క రాజమండ్రి వాళ్లే. టక్ జగదీష్ సెలెబ్రేషన్స్ ఇక్కడి నుంచి మొదలుపెట్టడం ఆనందంగా ఉంది. పరిచయ వేడుక అనే ఈవెంట్‌ను ఇక్కడ పెట్టడానికి కారణం ఉంది. ఓ ఫ్యామిలీని మరో ఫ్యామిలీ (రాజమండ్రి)కి పరిచయం చేయాలని ఇక్కడ పెట్టాం. టక్ జగదీష్‌ వాళ్ల అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోకుండా ఏ పని మొదలుపెట్టడు.. అలాగే ఈ నానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. మా అమ్మ బ్లెస్సింగ్ లేకపోతే బయటకు వెళ్లను. టక్ జగదీష్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు ఇక్కడి (రాజమండ్రి) అమ్మల దగ్గరి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మా అమ్మానాన్నలు నన్ను చూసి గర్వపడుతుంటారు.. అలా నన్ను చూసి అభిమానులు గర్వపడేలా చేస్తాను’ అని అన్నారు. ఆది శేష నాయుడు(నాజర్) మా నాన్న, మా అమ్మ అర్జునమ్మ, బోస్ (జగపతి బాబు ) మా అన్నయ్య.. దేవుడు బావ (రావు రమేష్ ).. సత్తిబాబు బావ(నరేష్).. కుమారక్క (రోహిణి), గంగక్క (దేవదర్శిని) అంటూ సినిమాలోని పాత్రలు, పాత్రధారుల పేర్లను, వారి స్వభావాలను నాని వివరిస్తూ టక్ జగదీష్ కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు. ఏప్రిల్ 23న ‘ట‌క్ జ‌గ‌దీష్’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

తారాగ‌ణం:నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

- Advertisement -