- Advertisement -
రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లు పైబడిన వారికి టీకా అందించగా ఇకపై 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు దాటినవాందరికీ టీకా పంపిణీ చేయనున్నామని తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ . అర్హులైన వారందరూ టీకా కోసం నమోదు చేసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు.
శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్ర సంఘాల సూచన మేరకు కోవిడ్ టీకా రెండవ డోసును నాలుగు నుంచి 8 వారాల మధ్య తీసుకోవచ్చు అని మంత్రి తెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు ఈ నియమం వర్తిస్తుందన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి రక్షణ పొందాలని అభ్యర్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
- Advertisement -