67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటించింది కేంద్రం. జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రం నిలిచింది. మహర్షి చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కైవసం చేసుకున్నారు రాజు సుందరం.
ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన జెర్సీ.
జెర్సీ సినిమాకు గానూ ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలికి జాతీయ అవార్డు.
ఉత్తమ చిత్రంగా మలయాళీ చిత్రం ‘మరక్కర్ ద లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన చిచోరే కు ఉత్తమ హిందీ చిత్రం అవార్డు.
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్
తమిళ నటుడు ధనుష్‌లకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు.
భోస్లే సినిమాకు గానూ మనోజ్ బాజ్‌పాయ్, అసురన్’ చిత్రానికి గానూ ధనుష్‌కు ఉత్తమ నటుడి అవార్డు.
మణికర్ణిక, పంగా చిత్రాలకు గానూ కంగానా రనౌత్ కు ఉత్తమనటి అవార్డు.
ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి, ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతికి అవార్డు.
జల్లికట్టు సినిమాకు గిరీశ్ గంగాధరన్‌కు సినిమాటోగ్రఫీ అవార్డు.
ఫిలిం ఫ్రెండ్లీ రాష్ట్రంగా సిక్కింకు పురస్కారం.
కేసరి చిత్రంలోని తెరి మిట్టి పాటకు గాను ఉత్తమ్ మేల్ సింగర్ గా బి ప్రాక్.
ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రంగా యాన్ ఇంజనీర్డ్ డ్రీమ్.