అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి సోషల్ మీడియాలోకి రానున్నాడు. జనవరిలో క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ సలహాదారు జేసన్ మిల్లర్ కీలక ప్రకటన చేశారు.
తన స్వంత ప్లాట్‌ఫామ్‌పై ట్రంప్ మళ్లీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇస్తారని ఇందుకు రెండు లేదా మూడు నెలల టైం పట్టొచ్చని తెలిపారు. ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా గ్రూపు చాలా భిన్నంగా ఉంటుందని, సోషల్ మీడియా చరిత్రనే మార్చేస్తుందని ఆయన అన్నారు.
ట్రంప్ రెచ్చగొట్టే ప్రసంగం ఇవ్వడం వల్ల క్యాపిటల్ హిల్ దాడి జరిగిందని, మరింతగా తన ప్రసంగాలతో ట్రంప్ ప్రజల్ని ఉసిగొల్పొద్దు అన్న ఉద్దేశంతో ట్విట్టర్ సంస్థ ఆయన అకౌంట్‌ను సీజ్ చేసింది. ట్రంప్ తన పదవీకాలంలో ప్రధాన మీడియాను పక్కనపెట్టి, కేవలం ట్వీట్ల ద్వారానే తన ఓటర్లతో ఆకర్షించారు.