కాగా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే!
ముఖ్యంగా ఈ సినిమాలోని పాటల విషయానికొస్తే దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇందులోని పాటలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. శ్రీమణి రాసిన ఈ సినిమా పాటలు కొన్ని నెలలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సముద్ర అందాల నడుమ పడవలో హీరో, హీరోయిన్లు పాడుకునే పాట ‘జలజల జలపాతం నువ్వు’ పూర్తి స్థాయి వీడియోను ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి సముద్రం అందాల నడుమ పడవలో ఏకాంతంగా గడిపిన సందర్భంగా ఈ చిత్రంలో ఈ పాట ఉంటుంది.ఈ పాటను శ్రేయా ఘోషల్, జస్ప్రీత్ జాజ్ పాడారు.