విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు ఇవే..

239
Passengers
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగిపోతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్‌ పెరుగుతున్న కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తమైంది. కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మాస్కులు ధరించనివారిని విమానం నుంచి దించేయాలని ఆదేశించింది. పలు నిబంధనలతో ఈరోజు ప్రకటన జారీ చేసింది.

డీజీసీఏ తాజా నిబంధనలు ఇవే:

-విమానాశ్రయంలో ప్రతి ఒక్కరూ సామాజికదూరం పాటించాలి. కోవిడ్ నిబంధనలను పాటించని ప్రయాణికులను భద్రతా సిబ్బందికి అప్పగించాలి.
-మాస్క్ లేని వారిని ఎయిర్ పోర్టులోకి అనుమతించరాదు. సీఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది ప్రయాణికులను గమనించాలి.
-ప్రయాణ సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్క్ ముక్కు కిందకు కాకుండా సరిగ్గా ధరించాలి.
-విమాన సిబ్బంది హెచ్చరించినా మాస్క్ పెట్టుకోని వారిని టేకాఫ్ కు ముందే కిందకు దించేయాలి.
-పదేపదే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారిని నిషేధిత జాబితాలోని ప్రయాణికుడిగా పరిగణించాలి.
-పదేపదే నిబంధనలను ఉల్లంఘించే ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

- Advertisement -