ఎమ్మెల్సీ కవిత బర్త్ డే…రక్తదాన శిబిరం

208
ali
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత బర్త్ డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లోని తెలంగాణ జాగృతి ప్ర‌ధాన కార్యాల‌యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై, రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి మహమూద్ అలీ గారు ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసారు. 30 మంది పేద విద్యార్థినులకు లేడి బర్డ్ సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు.దాదాపు 150 మంది తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఈ వేడుక‌ల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవీ ప్రసాద్, మర్రి రాజశేఖర్ రెడ్డి, తలసాని సాయి కిరణ్ యాదవ్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ పాల్గొన్నారు.

- Advertisement -