ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్

319
Tirath Singh
- Advertisement -

ఉత్త‌రాఖండ్ సీఎంగా తీర‌త్ సింగ్ రావ‌త్ ఎన్నికయ్యారు. డెహ్రాడూన్‌లోని బీజేపీ పార్టీ ఆఫీసులో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

కొత్త సీఎం తీర‌త్ సింగ్ వ‌య‌సు 56 ఏళ్లు. ఆయ‌న బీజేపీ ఎంపీ. ఉత్త‌రాఖండ్‌లో 2013 నుంచి 2015 వ‌ర‌కు ఆయ‌న ఉత్త‌రాఖండ్ పార్టీ చీఫ్‌గా చేశారు. గ‌తంలో ఎమ్మెల్యేగా చేశారు.

మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ పాల‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొంతకాలంగా అసంతృప్తితో ఉండగా తమను పరిగణనలోకి తీసుకోవట్లేదని, అధికారులు కూడా తమ మాట వినట్లేదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రావత్‌ సారథ్యంలో బరిలోకి దిగితే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని వారు హైకమాండ్‌కు స్పష్టంచేయడంతో రావత్ రాజీనామా చేశారు.

- Advertisement -