దేశం కోసం..ధర్మం కోసం..అన్నీ అమ్మేస్తాం..!

205
bandi
- Advertisement -

చూడండి మాష్టారు…ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటూ పట్నం వచ్చిన ప్రతివ్రతలు సిన్మాలో నూతనప్రసాద్ అన్న డైలాగ్ ఇప్పటి దేశ ప్రజలు ఉన్న పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది..అవును…ఇప్పుడు దేశంలో అతి పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా కష్టాల్లో కూరుకుపోయారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుంది. దేశం కోసం..ధర్మం కోసం అని ప్రచవనాలు పలికే కమలనాథులు.. దేశాన్ని తన గుజరాతీ దోస్తులైన అంబానీలు, అదానీలకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు హిందూత్వ పేరుతో దేశంలోని మైనారిటీలపై సర్జికల్ స్ట్రైక్‌లు చేస్తామంటూ కాషాయ నేతలు విషం కక్కుతున్నారు. అధికారంలోకి రాగానే విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్న పెద్దమనిషి మోదీ ఆరేళ్ల అయినా పత్తా లేడు..పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు హుష్‌ కాకీ అయిపోయాయి. ప్రధాని మోదీ మాటల మనిషి తప్పా…చేతల మనిషిని కాదని నిరూపించుకుంటున్నారు. దేశ ప్రజలపై మోదీ పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. జీడీపీ పెంచుతానని అంటే అంతా ఆహో ఓహో అని భజన చేశారు. తీరా మోదీగారు చెప్పినట్లుగా జీడీపీ పెంచేశారు..అదే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచేసి మాట మీద నిలబడేసారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పెట్రోల్ ధరను సెంచరీ దాటించిన ఘనత మోదీకే దక్కింది.

మరోవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా కల్లోలంతో అల్లాడిపోతున్న సమయంలో ధరలు పెంచుతూ మోదీ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల పరం చేయడానికి కొత్త వ్యవసాయచట్టాలను తీసుకువచ్చారు. వాటికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై వేలాదిగా రైతులు ఆందోళనలు చేస్తున్నా మోదీ కనికరించడం లేదు. రైతులపై ఖలిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులంటూ ముద్ర వేసి రైతు ఉద్యమాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో ఒక్కొక్కటిగా తన దోస్తులైన అంబానీలు, అదానీలకు అమ్మేస్తున్నారు. ఇప్పటికే అంబానీ జియో కోసం బీఎస్ఎన్‌ఎల్‌ను దెబ్బకొట్టిన మోదీ..రైల్వేలను మరో గుజరాతీమిత్రుడు అదానీలకు అప్పగించేస్తున్నారు. ఎల్‌ఐసీ వంటి లాభాల్లో ఉన్న సంస్థలను రిలయన్స్ ఇన్య్సూరెన్స్ కంపెనీల కోసం ప్రైవేట్ పరం చేయబోతున్నారు.

ఇక మన తెలుగు జాతి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేసేందుకు మోదీ కుట్ర పన్నుతున్నారు. అదేమంటే వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం లేదంటూ మోదీ అడ్డంగా బుకాయిస్తున్నారు. అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు దేశ యువతకు కల్పిస్తామన్న పెద్ద మనిషి ఇప్పటి వరకు సరిగా పది వేల ఉద్యోగాలు కూడా ఇచ్చింది లేదు. పైగా ప్రైవేటుతోనే ఉద్యోగాలు వస్తాయని సెలవిస్తున్నారు మన మోదీ సార్. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, రైల్వేలు, విశాఖ ఉక్కు మాత్రమే కాదు..4 వ్యూహాత్మక రంగాల్లో తప్పా..మిగతా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేట్ పరం చేస్తానని అంటే తన దోస్తులైన అంబానీలు, అదానీలకు అప్పగించేస్తానని మోదీ సార్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసారు. మొత్తంగా ప్రధాని మోదీ యావత్ దేశాన్ని అంబానీలకు, అదానీలకు తాకట్టు పెట్టేసి మున్ముందు దేశ ప్రజలను గుజరాత్‌‌కు గులాంలుగా మార్చే కుట్ర చేస్తున్నారు. దేశ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి.. త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పాండిచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటు మన చేతిలోని ఆయుధం..దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ, దేశాన్ని అంబానీలు, అదానీలకు అమ్మేస్తున్న బీజేపీకి మనమెందుకు ఓటేయ్యాలి. ఇవాళ బీజేపీ మతతత్వ రాజకీయాలకు లొంగిపోయి ఓటేస్తే..రేపు మన బిడ్డల భవిష్యత్తును మనమే ప్రమాదంలోకి నెట్టేసినవాళ్లం అవుతాము..ఇప్పుడు మనకు టైమ్ వచ్చింది..బీజేపీకి బుద్ధి చెప్పి మోదీ నిరంకుశ పాలనకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. దేశ ప్రజలారా జాగో..బీజేపీ హఠావో…దేశ్ బచావో..!

- Advertisement -