దేశంలో 24 గంటల్లో 17,921 కరోనా కేసులు

208
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 133 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,62,707కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 1,84,598 యాక్టివ్ కేసులుండగా 1,09,20,046 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,58,063కు చేరాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించగా రోజుకు 20 లక్షల వ్యాక్సిన్స్‌ ప్రజలకు ఇస్తున్నారు.

- Advertisement -