ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రాజీనామా…

158
trivedi
- Advertisement -

సొంత పార్టీ నేతల నుండి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. ఈ మేరకు తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. ఉత్తరాఖండ్ లో 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు.

అయితే, గత కొంతకాలంగా ముఖ్యమంత్రిపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో సొంతపార్టీ నేతల నుండి విమర్శలు వస్తుండటంతో రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు రావత్. సోమవారం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -