ఈనెల 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం కానున్నారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సాయంత్రం టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, ఎన్నారై సలహాదారు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ప్రస్తుత కరోనా వల్ల ఆయా దేశాల్లో పరిస్థితి, మున్ముందు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మెంబర్‌షిప్ డ్రైవ్ పైన ఎమ్మెల్సీ కవిత సూచనలు చేయనున్నారని మహేష్ బిగాల తెలిపారు.
ఈ కార్యక్రములో ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి పాల్గొననున్నారు. ఈ ఆన్‌లైన్ కార్యక్రమాన్ని టీవీ ఆసియా వారు ప్రతక్ష ప్రసారం చేయనున్నారు.