‘ఉప్పెన’ టీంకు అల్లు అర్జున్ ప్రశంసలు..

236
bunny
- Advertisement -

ఉప్పెన చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన ఉప్పెన చిత్రానికి విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. కాగా, తాజాగా స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఉప్పెన సినిమాను చూశారు. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు.

తొలి సినిమాతోనే అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అని పొగిడారు. వైష్ణ‌వ్‌కు అద్భుతమైన డెబ్యూ దొరికింది అని తెలిపారు అల్లు అర్జున్. అలాగే హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు. ఒక సున్నితమైన పాయింట్ తీసుకొని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను పొగడ్తల్లో ముంచెత్తారు అల్లు అర్జున్.

- Advertisement -