అహ్మదాబాద్‌ టెస్టు: తొలి రోజు భారత్‌దే పైచేయి

68
India vs England

అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై భారత్‌ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68)‌, రవిచంద్రన్‌ అశ్విన్‌(3/47) మాయాజాలానికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205కే కుప్పకూలడంతో నాలుగో టెస్ట్‌ తొలి రోజు గురువారం టీమ్‌ఇండియాదే పైచేయిగా నిలిచింది.

ఇరుజట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 1 వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 8, ఛటేశ్వర్ పుజారా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఖాతా ఆరంభించకుండానే ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 181 పరుగులు వెనుకబడి ఉంది.