మహిళా పట్టభద్రులంతా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికే ఓటేయాలని పిలుపునిచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తాండూరులో జరిగిన పట్టభద్రుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సబితా…మహిళా పట్టభద్రులంతా ఎన్నికల్లో వాణీదేవికే ఓటు వేయాలన్నారు. విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాణీదేవికి ఓటు వేసి గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. కరోనాతో విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ప్రైవేటు సంస్థల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యాలయాలను తెరవాలని సీఎం చెప్పారన్నారు. చిన్న చిన్న ప్రైవేటు విద్యా సంస్థలు పిల్లలకు విద్యతో పాటు ఉపాధి కల్పించే వాటిగా సీఎం భావిస్తున్నారన్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వం పాఠశాల వాహనాలకు రద్దు చేయడం జరిగిందన్నారు.