- Advertisement -
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నేటి నుండి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ అందించనుండగా తాజాగా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవాళ ఉదయం చెన్నైలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ఫొటోలతో సహా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండో డోసును 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని వెంకయ్య తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యాక్సిన్ సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఆయన చెప్పారు.
ఇక మరోవైపు కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో తమిళనాడులో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆదివారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
- Advertisement -