వచ్చే సంక్రాంతికి పవన్‌ 27..!

186
PSPK 27
- Advertisement -

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 27వ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని మెగా సూర్య ప్రొడక్షన్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నారని సమాచారం.

17వ శతాబ్దం నాటి కాలం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఇందుకోసం భారీ సెట్స్ కూడా వేసున్నారు. ఎ.ఎంరత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ని మార్చ్ 11న శివరాత్రి సందర్భంగా ప్రకటించే అవకాశం వుంది.

- Advertisement -