టాలీవుడ్‌లో మరో విషాదం..

334
Producer Sandeep Koritala
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి మర్చిపోయే లోపు మరొకటి వస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో పలు సినిమాలు నిర్మించిన కొరటాల సందీప్ (39) నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. బాపట్లలోని తన నివాసంలో ఉన్న సందీప్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబం సభ్యులు వెంటనే ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్వగ్రామమైన పూండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు.

సందీప్ చాలా చిన్న వయసులోనే సినీ నిర్మాతగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందారు. నారా రోహిత్‌తో ‘రౌడీ ఫెలో’, నిఖిల్‌తో ‘స్వామి రారా’, ‘వీడు తేడా’ వంటి సినిమాలు నిర్మించారు. సందీప్ మృతి విషయం తెలిసి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

- Advertisement -