ప్రశ్నలను పరిష్కరించే గొంతుగా ఉంటా- పల్లా రాజేశ్వర్ రెడ్డి

153
- Advertisement -

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, స్థానిక శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత వేగంగా ప్రౌజెక్టులను నిర్మించుకుంటున్నం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్కుంటున్నం అని అన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా, కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా అవాస్తవాలు, అభూత కల్పలను ప్రచారం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా దేశంలో యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి పంట వేసినం…కేసీఆర్ కల సాకారమైంది అని అన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోగలిగినం. 14.2% ఆర్థిక వృద్ధితో పెద్ద రాష్ట్రాల్లో ముందున్న మేము బికారీయా, మీరు, మీ రాష్ట్రాలు బికారీయా అని అన్నారు. అప్పులు ఎఫ్ఆర్బీయం రేటుకు లోబడే తెచ్చుకోవాలి.. మనకంటే 26 రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేసినయి అని అన్నారు. రైతు చనిపోతే ఐదు రోజుల్లో 5 లక్షలు రైతు కుటుంబానికి ఇస్తున్నం… కేంద్రం కానీ, వేరే రాష్ట్రాలు కానీ ఇస్తున్నయ అని పల్లా ప్రశ్నించారు.

కొద్దిగా పీఆర్సీ లేట్ అయ్యింది. మ్యానిఫెస్టోలో పెట్టుకున్నయ్ కొద్దిగా లేటు అయినయి. మ్యానిఫెస్టోలో పెట్టనివాటినే అనేకం చేసిండు, చెప్పినవి బరాబర్ చేసేవాడు కేసీఆరే అని అన్నారు. కేసీఆర్, లక్ష ఉద్యోగాలు ఇస్తా అన్నవ్ కదా ఏమైంది అని మాట్లాడ్తున్నరు. లక్ష కాదు, లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినం అని లెక్కలు చెప్పినం. లెక్కసరి చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడ్తున్నరు. ఒక్క లెక్క తప్పున్న నేను పోటీ నుండి విరమించుకుంటా అని వాళ్లందరికీ సవాల్ విసిరుతున్నా. ఇంకొన్ని నియామకాలకు నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నయి అని అన్నారు. 14,800 కొత్త కంపెనీలకు పెర్మిషన్లు ఇచ్చినం, 14.5 లక్షల ఉద్యోగాలు ఒచ్చినయి అని తెలిపారు. 16 రకాల పెర్మిషన్లు 15 రోజుల్లో ఇచ్చినం అని అన్నారు. వరంగల్ కి కూడా మూడు ఐటీ కంపెనీలు ఒచ్చినయి. టాస్క్ సెంటర్లు పెట్టుకున్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నం అని పల్లా తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకి ఇచ్చే విధంగా ప్రెసిండెంట్ అసెంట్ తెచ్చుకున్నం. ఉద్యోగాలు ఇయ్యనివాళ్ళు, రేట్లు పెంచినవాళ్ళు, కంపెనీలు మూసేసినవాళ్ళు ఇష్టమొచ్చినట్లు మాట్లాడ్తున్నరు అని అన్నారు. 2014 తర్వాత మనం ఒక్క కంపెనీని మూసేయలేదు. సింగరేణిని లాభాల్లో తీసుకొచ్చినం అని అన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారికి సమాధానం చెప్పే అవసరం ఉన్నది అని అన్నారు.తెలంగాణ కావాలని ప్రపంచంలోనే అత్యంత పెద్ద సభని ఇక్కడ పెట్టి లక్షల గొంతులు ప్రశ్నించాయి అని అన్నారు. ప్రశ్నలకు సమధానం చూపించి పరిష్కరించే గొంతుగా ఉంటా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -