ముధోల్ నియోజకవర్గం కుంటాల గ్రామంలోని గజ్జలమ్మ దేవాలయాన్ని శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ ఆలయాన్ని రూ20 లక్షలతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించామని కాంపౌండ్, గాలి గోపురానికి మరో 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. అంతకు ముందు మంత్రికి ఆలయ అర్చకులు, స్వాములు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

అంతకుముందు నిర్మల్ రూరల్ మండలంలోని ప్రసిద్ధి చెందిన ముజ్గి మల్లన్న పల్లకి శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసానికి చేరుకోగా మంత్రి తన నివాసంలో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి కి స్వాగతం పలికారు. గత సంవత్సరం డిసెంబర్లో పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ పల్లకి సేవ రెండు నెలలు పూర్తి చేసుకొని తిరిగి మాఘ పౌర్ణమిన గ్రామంలో కొలువై ఉన్న ఆలయానికి చేరుకుంటుందని ఈ నెల 28వ తేదీన రథోత్సవం, మార్చి 2న అగ్నిగుండ ప్రవేశంతో పాటు జాతర మహోత్సవం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు.ఆలయ అభివృద్ధి కోసం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.


