అభివృద్ధిని చూసి ఓటేయండి: ఎర్రబెల్లి

160
errabelli
- Advertisement -

అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి, అభ్యర్థి ని చూడండి… భారీ మెజారిటీ తో ఎన్నుకోండి అని పట్టభద్రుల ఓటర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు నిచ్చారు. విద్యాధికుడు, విద్యాసంస్థల అధినేత, మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి, మన సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వద్ద చెప్పే చనువు ఉన్న నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీతో గెలిపించాలని నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నేడు కురవి లో టీఆరెఎస్ పార్టీ నాయకులు, పట్టభద్రుల తో నిర్వహించిన సమావేశంలో మంత్రులు *శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ గా , ఎంపి మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్యే శ్రీ రెడ్యా నాయక్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.

*సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ… పట్టభద్రుల ఓటర్లు అంటే, చదువుకున్న వారు, ఆలోచించి, విశ్లేషించి, విచక్షణ తో ఓటు వినియోగించాలని సూచించారు. ఏవేవో కొన్ని చిన్న ఆవేశాలకు లోను కావద్దన్నారు. టీఆరెఎస్ రాక ముందు, వచ్చాక పరిస్థితులు బేరీజు వేసుకుని చూడండి. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏదో ఒకటి మీకు అంది ఉంటాయి. మీ అనుభవం లోకి వచ్చి ఉంటాయి. ఇంత కంటే ఎవరైనా ఎక్కువ చేశారా? చేయగలరా? ఆలోచించండి. టీఆరెఎస్ అభ్యర్థికి మీ ఓటు వేసి గెలిపించండి… అంటూ పట్టభద్రుల ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. ఓట్లు రాగానే కొందరు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఇక్కడే ఉండి, మన కోసం ఆలోచించే వాళ్ల కు మాత్రమే మన పట్ల, మన ప్రాంతం పట్ల, ఆర్తి ఉంటుందన్నారు.

ఓట్ల కోసమే వచ్చే వాళ్లకు ఈ ప్రాంత సమస్యలు తెలువదని, ఇక్కడి వారే కాదని, అలాంటి వారిని ఎన్నుకుంటే మనకు జరిగే ఉపయోగం ఏమీ ఉండదు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రులు ఏకరువు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకే అన్ని వర్గాల ప్రజలకు గౌరవం పెరిగిందని, ఉద్యోగుల వేతనాలు పెరిగాయని, భద్రత వచ్చిందన్నారు. అర్థం పర్థం లేకుండా విమర్శించే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి సమస్యల గురించి తెలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,* గడిచిన ఆరున్నర ఏళ్లలో లక్షా 32 వేల 899 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రైవేట్ రంగంలో 14 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమ టాగ్ లైన్ నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు మనవి మనకే దక్కే విధంగా సీఎం కెసిఆర్ చేసి చూపించారని లెక్కలతో సహా వివరించారు

- Advertisement -