రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు..

132
Rain in Telangana
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉంది. ఉత్తర కోస్తా ఆంద్రప్రదేశ్ తీరం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిమీ నుండి 3.1 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే దక్షిణ మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది.

దీంతో రాష్ట్రంలో ఈరోజు ఒకటి రెండు చోట్ల తెలీకపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.

- Advertisement -