రాష్ట్రంలోని వికలాంగులకు కొవిడ్ వ్యాక్సిన్..

27
Covid vaccine

రాష్ట్రంలోని వికలాంగులకు వచ్చే నెల మార్చిలో కొవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేయనున్నామని, ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అంగీకారాన్ని తెలిపారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం మంత్రుల నివాసంలో జాతీయ వికలాంగుల హక్కుల ఫోరం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు జెరిపోతుల పరశురాం కలిసి వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు.

ఈ మేరకు వారు వినోద్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. వికలాంగుల హక్కుల ఫోరం విజ్ఞప్తి మేరకు మంత్రి ఈటల రాజేందర్‌తో వినోద్ కుమార్ మాట్లాడారు. దీనితో వికలాంగులకు మార్చి నెలలో కొవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసేందుకు మంత్రి ఈటల అంగీకరించారు.