- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షార్చన కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొంటూ తనకు 2 చేతులు లేకున్నా మొక్కలు నాటారు వికలాంగుడు జాకీర్ పాషా.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన పిలుపు మేరకు ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ లో తనకు 2 చేతులు లేకున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు కోటి వృక్షార్చన కార్యక్రమం లో పాల్గొని కాళ్లతో మొక్కను నాటి నీళ్ళు పోసి అందరికీ ఆదర్శంగా నిలవడం జరిగింది.
తనకు 2 చేతులు లేకున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజును కాళ్ళతో మొక్కలు నాటిన జాకీర్ పాషా యొక్క నిబద్ధతను చూసిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఇతరులు అభినందించడం జరిగింది.
- Advertisement -