మైదానంలో విరాట్ విజిల్ వేస్తూ.. వీడియో వైరల్

211
Virat kohli
- Advertisement -

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సూపర్ జోష్‌లో ఉన్నాడు. ఈ టెస్టులో విజయం దిశగా భారత జట్టు సాగుతున్న వేళ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో దుమ్ములేపుతున్న వేళ, అభిమానులను ఉత్సాహపరుస్తూ, మైదానంలో కోహ్లీ కనబడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

చెన్నైలో క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది ‘విజిల్ పోడు’ (ఈల వెయ్యి). ఐపీఎల్ పుణ్యమాని ఈ పదం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఇక నిన్న మ్యాచ్ ఆడుతున్న సమయంలో కోహ్లీ, మైదానంలో విజిల్ వేస్తూ, అభిమానులు కూడా విజిల్ వేయాలని ఉత్సాహపరిచాడు. ఈ మేరకు సైగలు చేశాడు. దీంతో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ, గోల చేస్తుంటే, తనకు వినిపించడం లేదని సైగ చేస్తూ, వారిని మరింతగా ఉత్సాహపరిచాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకపోగా, 50 శాతం నిండిన మైదానం కూడా దద్దరిల్లిపోయింది. దీంతో కోహ్లీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపాడు.

ఇక ఫస్ట్ ఇన్నింగ్‌లో 329 పరుగులతో టీమిండియా రాణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది.

- Advertisement -