ఇద్దరు పిల్లలను కనండీ..మొత్తుకుంటున్న చైనా!

229
china
- Advertisement -

ప్రపంచంలో అత్యధిక జనభా కలిగిన దేశం ఏదంటే టక్కున గుర్తుకొచ్చేది చైనా. రోజురోజుకి పెరిగిపోతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు 1970లో వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది చైనా. అయితే తర్వాత చైనాలో జననాల రేటు భారీగా పడిపోవడంతో 2016లో నిబంధనలను సడలిస్తూ ఇద్దరు పిల్లలను కనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ఇది ఆశీలించిన మేర ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇద్దరు పిల్లలను కనాలని మొత్తుకుంటోంది చైనా ప్రభుత్వం. 2020లో చైనాలో 10.04 మిలియన్ల జననాలు మాత్రమే నమోదుకాగా 2019 సంవత్సరంతో పోలిస్తే 30 శాతానికి తగ్గిపోయింది,.

చైనా సమాజంలో చోటుచేసుకున్న ఆర్థిక, సామాజిక మార్పులతో జీవన వ్యయం భారీగా పెరిగింది. దీంతో యువత పెళ్లిళ్లను, దంపతులు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకోవడం ప్రారంభించారు. దీంతో తాజాగా అక్కడ పునరుత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పిల్లలను కనాలని మొత్తుకుంటోంది చైనా. అయితే ఈ ఇద్దరు పిల్లల విధానం చైనా జనాభాపై ప్రభావాన్ని చూపడానికి మరో దశాబ్దానికి పైగా పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -