- Advertisement -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూతురు హర్షితకి షాకిచ్చారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా ఆమె అకౌంట్ నుండి రూ. 34 వేలు కొట్టేశారు. సెకండ్ హ్యాండ్ సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు హర్షిత. ఇది చూసిన ఓ వ్యక్తి ఆమెను సంప్రదించుకుని డీల్ కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ బార్ కోడ్ని స్కాన్ చేయమని లింక్ పంపించగా వెంటనే డబ్బును ట్రాన్స్ ఫర్ చేశాడు.
తర్వాత అదే క్యూఆర్ కోడ్ని ఉపయోగించి హర్షిత అకౌంట్ నుండి సైబర్ నేరస్ధుడు రూ.14,000 ఒకసారి, రూ.20,000 వేలు ఒకసారి దోచేశాడు. మోసపోయానని గ్రహించిన హర్షిత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఒక కుమారుడు,కుమార్తె ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఆమె కెమికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు.
- Advertisement -