అమెరికన్లను వణికిస్తున్న యూకే వేరియంట్..

174
covid 19
- Advertisement -

అమెరికాను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. కరోనాకు తోడు యుకే వేరియంట్ తోడు కావడంతో అమెరికా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్న రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

అత్యంత ప్రమాదకరమైన (B.1.1.7) యూకే వేరియంట్ మార్చి నాటికి మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని ఓ స్టడీలో తేలింది. అమెరికాలోని ఇతర వేరియంట్ల కంటే 35 నుంచి 45 శాతం అత్యంత వేగంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపించగలదని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు.ఫ్లోరిడాలో కొత్త వేరియంట్‌తో ఇన్‌ఫెక్షన్ల శాతం ఐదు శాతం కంటే తక్కువ నుంచి 10 శాతానికి పెరిగాయని అధ్యయనం చెబుతోంది.

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోవడానికి మాస్క్, ఆంక్షలపై ఫ్లోరిడా కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల కేసుల తీవ్రత పెరిగి ఉండొచ్చునని నిపుణులు అంటున్నారు.

- Advertisement -