‘రాధాకృష్ణ’ చిత్రాన్ని వీక్షించిన మంత్రి ఐకె రెడ్డి..

201
minister ik reddy
- Advertisement -

నిర్మల్ కొయ్య బొమ్మల నేపథ్యంలో రూపొందించిన ‘రాధాకృష్ణ’ సినిమా మొదటి షోను శుక్రవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లోని తిరుమల థియేటర్‌లో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ కొయ్య బొమ్మల చరిత్ర అంతరించి పోకుండా కొయ్య బొమ్మలు తయారుచేసే నకాసీ కళాకారుల జీవన విధానం, శ్రమ గురించి ఒక మంచి సినిమా రాధాకృష్ణ సినిమా తీయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

నిర్మల్ పైన సినిమా తీసినందుకు చిత్ర యూనిట్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు మూవీని చూసి ఆదరించాలని మూవీ విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ విజయ రాంకిషన్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ముత్యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -