ప్రజా ప్రతినిధులు ప్రజలు అడిగిన సమస్యలను పరిష్కరించటానికి అలసత్వం చూపిస్తున్న రోజులు ఇవి. కానీ అందరు ఒకేలా ఉండరు అని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిరూపించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి ఐలయ్య రెండు సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో కలిసి ఆర్థిక పరిస్థితి వివరించగా.. మంత్రి ఎల్‌ఎం కొప్పుల ఛారిటీ ట్రస్టు ద్వారా ఐలయ్య కృత్రిమ కాలు కొనుగోలు కోసం 40 వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య కుటుంబ సభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక అనంతరం గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన అవరి వాణికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 2 లక్షల రూపాయల చెక్కులను కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారు కుటుంబానికి అందించారు సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్.