వైష్ణ‌వ్‌తేజ్‌ ఉప్పెన‌ ట్రైల‌ర్‌..

164
Uppena
- Advertisement -

మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ఉప్పెన‌. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్-సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్‌మ్యూజిక్ డైరెక్ట‌ర్. విజయ్‌సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ‘‘ఈ ట్రైలర్‌ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఆల్‌ ది బెస్ట్‌ బ్రదర్‌’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ప్రేమంటే ఓ లైలా మ‌జ్నూలా, దేవ‌దాసు-పార్వ‌తిలా..ఓ రోమియో జూలియ‌ట్‌లా అదో మాదిరిగానే ఉండాలి అంటూ వైష్ణ‌వ్‌తేజ్ ప‌డ‌వ‌పై ప‌డుకొని త‌న స్నేహితుడితో చెప్పే మాట‌ల‌తో ట్రైల‌ర్‌ ప్రారంభ‌మైంది.

ఆ త‌ర్వాత ఊర్లోకి బ‌స్సు రావ‌డం అందులో ఉన్న కృతిశెట్టిని ఫాలో కావ‌డం, ల‌వ్ ట్రాక్ స‌న్నివేశాల‌తో ఎంట‌ర్ టైనింగ్ సాగుతుండ‌గా..విజ‌య్ సేతుప‌తి ఎంట్రీతో యాక్ష‌న్ పార్టు మొద‌ల‌వ‌డం చూడొచ్చు. అబ‌ద్దాలాడితేనే ఆడ‌పిల్ల‌లు పుడతారంటే..మ‌రీ ఇంత అంద‌గ‌త్తె పుట్టిందంటే వీళ్ల బాబు మినిమం మ‌ర్డ‌ర్ ఏమైనా చేసి ఉంటాడంటావా రా..అంటూ వైష్ణ‌వ్‌తేజ్ చెప్పే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఓ వైపు ప్రేమ‌, మ‌రోవైపు విజ‌య్‌సేతుప‌తి పంతం..ఇలా రెండింటి మేళ‌వింపుతో సాగుతున్న ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తుంది.ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -