పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 12న థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే విడుదలైన “నీ కన్ను నీలి సముద్రం”, “ధక్ ధక్”, “రంగులద్దుకున్న” పాటలు సంగీత ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. లేటెస్ట్‌గా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రంలోని “జల జల జలపాతం నువ్వు..” అంటూ సాగే పాటను ఆదివారం రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, “ఇప్పుడే పాట విన్నాను, లాంచ్ చేశాను. దేవి శ్రీప్రసాద్ మరోసారి మ్యాజిక్ చేశారు. సాంగ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ మూవీతో ముగ్గురు పరిచయమవుతున్నారు.. డైరెక్టర్ బుచ్చిబాబు, హీరోయిన్ కృతి, హీరో వైష్ణవ్ తేజ్. ఈ ముగ్గురికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఈ సినిమా వారికి హ్యాపీనెస్‌ను, సక్సెస్‌ను తీసుకొస్తుందని ఆశిస్తున్నా. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ అంటున్నారు. అందరూ థియేటర్లలో ఈ సినిమా చూసి, ఎంజాయ్ చేయండి” అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ మాట్లాడుతూ, “ఈ ఆల్బమ్‌లోనే మా అందరి ఫేవరేట్ సాంగ్ ‘జల జల జలపాతం నువ్వు’. విజయ్ దేవరకొండ ఈ సాంగ్‌ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. దేవి ఈ సినిమాకు ఆల్‌టైమ్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. ఒక మంచి లవ్ స్టోరీకి ఆత్మ లాంటి సంగీతాన్నిచ్చారు.”అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా పాల్గొన్నారు. “జల జల జలపాతం నువ్వు.. సెల సెల సెలయేరుని నేను” అంటూ సాగే ఈ పాటను చిత్రంలో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిపై డ్యూయెట్‌గా చిత్రీకరించారు. దేవి శ్రీప్రసాద్ సమకూర్చిన సుమధుర బాణీలకు తగ్గట్లు అందమైన పదాలతో పాటను అల్లారు గేయ రచయిత శ్రీమణి. జస్‌ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ గాత్రంలో ఈ మెలోడీ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనేట్లు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తన మ్యూజిక్ టేస్ట్‌తో, పాటలను ప్రెజెంట్ చేసిన విధానంతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను అందిస్తున్నారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఉప్పెనలో సాయిచంద్, బ్రహ్మాజీ కీలక పాత్రధారులు.
తారాగణం:పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సీఈవో: చెర్రీ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి.