ఆసుపత్రి నుండి సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్..

170
Sourav Ganguly
- Advertisement -

భారత మాజీ కెప్టెన్,బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గుండె నొప్పితో కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెకి రెండు స్టంట్‌లు వేశారు. ఆయ‌న‌ ఆరోగ్యం నిలకడగా ఉండ‌డంతో ఆయ‌న‌ను ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని అపోలో ఆసుప‌త్రి డాక్ట‌ర్ రాణా దాస్‌గుప్తా తెలిపారు.

కాగా, ఈ నెల‌ తొలి వారంలో తన ఇంట్లో గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతీ నొప్పి రావ‌డంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం ఆయ‌న కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గ‌త బుధవారం మళ్లీ ఆయ‌న‌కు ఛాతీలో నొప్పి రావ‌డంతో కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయ‌న‌కు అపోలోలో వైద్యులు చికిత్స అందించారు.

- Advertisement -