- Advertisement -
చిరు వ్యాపారులను ప్రోత్స హించాలన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శనివారం ఆమె వికారాబాద్లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా మార్గం మధ్యలో వేరుశనగ అమ్ముతున్న చిరువ్యాపారులను చూసి కారు ఆపి దిగి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఆప్యాయతతో పలకరించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వారి వద్ద వేరుశనగను కొనుగోలు చేసి కాసేపు వారితో ముచ్చటించారు.
అనంతరం వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వికారాబాద్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అందకుముందు మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతిపిత విగ్రహానికి పూలమాలవేసి, ఘనంగా నివాళి అర్పించారు.
- Advertisement -