ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక- ఎస్ఈసీ

136
sec
- Advertisement -

జీహెచ్ఎంసీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసినదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి తెలిపారు. పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఎన్నికల అధికారి మరియు జీహెచ్ఎంసీ కమిషనరు జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక జిల్లా కలెక్టరును ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిగా నియమించడం జరుగుతుందన్నారు.

ఎన్నికల కమిషన్ జారీ చేసిన పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రిసైడింగ్ అధికారి ఫిబ్రవరి 6వ తేదీలోపు ఈ ప్రత్యేక సమావేశము నోటీసును జీహెచ్ఎంసీ మెంబర్ల౦దరికి జారీచేయాలి. ఫిబ్రవరి 11 వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం గం. 12.30 లకు జరుగు ప్రత్యేక సమావేశములో మొదట మేయర్ ఎన్నిక పిదప ఉపమేయర్ ఎన్నిక జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.

అదేవిధంగా మొదట మేయర్ ఎన్నిక జరిగిన తర్వాతే ఉపమేయర్ ఎన్నిక నిర్వహించబడుతుందని, ఏవేని కారణాల వల్ల 11.02.2021న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు అనగా 12.02.2021 (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ)న ఈ ఎన్నిక నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిని పరిశీలకునిగా నియమించడం జరుగుతుందన్నారు.

- Advertisement -