మరోసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం- రైతుల చర్చలు..

46
Farmers Protest

కేంద్ర కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రైతులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యంపై రైతు సంఘాలు 11వ సారి కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వ‌న్‌లో ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఏడాదిన్న‌ర పాటు సాగు చ‌ట్టాల అమ‌లుపై స్టే విధించేందుకు కేంద్రం ఆస‌క్తి చూపిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం జాయింట్ క‌మిటీని ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో 11వ సారి రైతు సంఘాల‌తో చ‌ర్చలు జ‌రిగాయి. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమ‌ర్‌, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌, వాణిజ్య‌శాఖ స‌హాయ‌మంత్రి సోమ్ ప్ర‌కాశ్‌లు 41 రైతు సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చించారు.

ఈ భేటీలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే చట్టాల సవరణలకు మాత్రమే కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలపారు. ఈ మేరకు తాము సూచించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలన్న కేంద్రం స్పష్టం చేసింది. తమ ప్రతిపాదనల కంటే ఇంకా మంచి ప్రతిపాదనలు ఉంటే రైతులే చెప్పాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు వెనక్కి తగ్గకుండా తమ డిమాండ్ నే కేంద్రం పరిశీలించాలని మరోసారి డిమాండ్‌ చేశారు. భోజన విరామం తర్వాత మళ్ళీ సమావేశం అయ్యేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి భేటి తేదీ ఖరారు కాకుండానే చర్చలు ముగిశాయి.