రెండోదశలో పీఎం,సీఎంలకు కరోనా టీకా!

209
modi
- Advertisement -

దేశంలో ఈ నెల 16 నుండి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిదశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేస్తుండగా రెండో దశలో ప్రధానమంత్రితో పాటు సీఎంలకు కరోనా టీకా ఇవ్వనున్నారు.

ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. రాజ‌కీయ‌వేత్త‌లతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండ‌వ రౌండ్‌లో టీకా తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 7.86 ల‌క్ష‌ల హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు టీకాలు వేసుకోగా తెలంగాణ టీకాల పంపిణీలో అగ్రస్ధానంలో ఉంది.

- Advertisement -