ఐకేపీ ఉద్యోగుల క్యాలెండర్ ని ఆవిష్కరించిన మంత్రి ఎర్ర‌బెల్లి..

40
errabelli

తెలంగాణ IKP VOA ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో త‌న క్యాంపు కార్యాల‌యంలో మంత్రి ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐకెపి లోని విఓఎలు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్నార‌ని అభినందించారు.

మ‌రింత మెరుగ్గా ప‌ని చేసి, ప్ర‌భుత్వానికి మంచి పేరు తేవాల‌ని వారికి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు L. రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షులు మంచికంటి కోటేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిపెళ్లి మాధవి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు పొలు దాసరి రమేష్, నరసింహులు, మచ్చేందర్, నెహ్రు, రాజ్ కుమార్, రవీందర్, అనురాధ, అరుణ, రవీందర్, వెంకన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.