బైడెన్‌ టీమ్‌లో కరీంనగర్‌ వాసి!

266
biden
- Advertisement -

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ప్రమాణస్వీకారం చేయనుండగా బైడెన్‌ టీమ్‌లో ఇప్పటికే పలువురు భారతీయులు చేరారు.

ఇక తాజాగా కరీంనగర్‌ జిల్లా పోతిరెడ్డిపేటకు చెందిన చొల్లేటి వినయ్‌ రెడ్డి…బైడెన్ టీమ్‌లో చేరనున్నాడు.హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి నారాయణరెడ్డి, విజయారెడ్డి దంపతులు 1970లో అమెరికా వెళ్లారు.

నారాయణరెడ్డి అక్కడే డాక్టర్‌గా స్థిరపడగా, ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకరైన వినయ్‌రెడ్డి వైట్‌హౌస్‌లో బైడెన్‌కు స్పీచ్‌ రైటింగ్‌ డైరెక్టర్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలోనై బైడెన్‌కు స్పీచ్ రైటర్‌గా పనిచేశారు వినయ్‌.

- Advertisement -