బైడెన్ పట్టాభిషేకం నేడే..

223
Joe Biden
- Advertisement -

మరికొన్ని గంటల్లోనే అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 78 ఏళ్ల వయస్సులో ఆయన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. కేపిటల్‌ హిల్‌ భవనం సాక్షిగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. బైడెన్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేయనున్నారు.

ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. కేపిటల్‌ భవనంపై దాడిని దృష్టిలో ఉంచుకొని.. గతంలో ఎన్నడూలేని విధంగా 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌తో వాషింగ్టన్‌లో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

కరోనా నేపథ్యంలో బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవం నిరాడంబరంగా జరగనుంది. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేశారు. అమెరికన్ సంప్రదాయాలకు విరుద్ధంగా డొనాల్డ్‌ ట్రంప్‌ – బైడెన్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకావడంలేదు.

- Advertisement -