- Advertisement -
భారతీయ జనతా పార్టీపై మరోసారి తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పురులియాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మమతా..మావోయిస్టుల కంటేకాషాయ పార్టీ ప్రమాదకరమన్నారు. బీజేపీలో చేరాలనుకునే వారు బయలుదేరవచ్చు.. కానీ మేం కాషాయ పార్టీ ముందు తలవంచం అన్నారు. రాజకీయాలు గంభీరమైన భావజాలం, తత్వశాస్త్రం.. ఒకరు రోజు బట్టలు మార్చుకోవచ్చు కానీ.. భావజాలం కాదు అన్నారు.
తమ పార్టీ సమావేశంలో అవాంతరాలు సృష్టించేందుకు బీజేపీ కొంత మందిని పంపిస్తుందని ఆరోపించాచిన మమతా….. ఇకపై తాము కూడా బీజేపీ, సీపీఎం సమావేశాలకు భంగం కల్పించేందుకు కొంత మందిని పంపుతామన్నారు.
294 ఎమ్మెల్యే స్థానాలున్న అసెంబ్లీకి ఏప్రిల్-మే మధ్య ఎన్నికలు జరుగనున్నాయి.
- Advertisement -