గోదారమ్మకు పుష్పాంజలి ఘటించిన సీఎం కేసీఆర్‌..

145
kcr cm
- Advertisement -

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రంలో ప‌ర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు. అనంతరం సీఎం దంపతులు ప్రాణ హిత గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద తల్లి గోదారమ్మకు పుష్పాంజలి ఘటించారు. పసుపు కుంకుమలను, నాణాలను నీటిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం తదనంతర నిర్మాణం సందర్భంగా ఎదుర్కున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

kcr

తెలంగాణ రైతన్నకు వెన్ను దన్నుగా నిలుస్తూ తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్న ప్రాణహిత గోదావరి జలదృష్యాన్ని చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంజనీర్లు, అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేశారని అభినందించారు. అనంతరం మేడిగడ్డ బయలు దేరారు సీఎం కేసీఆర్‌.

- Advertisement -