- Advertisement -
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా నిలిచింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మాట్లాడిన మంత్రి ఈటల… ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభంకాగా తొలిదశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇవ్వనున్నారు.
- Advertisement -