జూన్‌లో తెలంగాణ ఎంసెట్!

209
eamcet
- Advertisement -

ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9వ తరగతి నుండి ఆపై తరగతులను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా తాజాగా తెలంగాణ ఎంసెట్ 2021కి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

ఈ ఏడాది జూన్ రెండో వారంలో నిర్వ‌హించేందుకు రాష్ర్ట ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. క‌రోనా ప్ర‌భావంతో ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ఆల‌స్యంగా ప్రారంభ‌మైన నేప‌థ్యంలో వార్షిక ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ చివ‌రి వారంలో నిర్వ‌హించి, మే రెండో వారానికి పూర్తి చేయాల‌ని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.

పరీక్షలు ముగిశాక మూడు నుంచి నాలుగు వారాల గ‌డువు ఇచ్చి ఎంసెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఎంసెట్ 2021కు సంబంధించిన తేదీల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

- Advertisement -