నాగోబా జాతర రద్దు…!

140
nagoba-jatara
- Advertisement -

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలోని నాగోబా జాతర ఈ ఏడాది రద్దైంది. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత.

అయితే ఈ సారి నాగాబో జాతర రద్దైంది. ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించే నాగోబా జాతరను రద్దు చేస్తూ మెస్రం వంశీయులు తీర్మానించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయం(మురాడి)లో సమావేశమై పలు తీర్మానాలు చేశారు.

కొవిడ్‌-19 నేపథ్యంలో కేవలం మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు, కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. నాగోబాకు మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజలతోపాటు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.

- Advertisement -