దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ నెల 16 నుండి వ్యాక్సిన్ పంపిణీ జరగనుండగా స్పందించారు సీరమ్ సీఈవో అదర్ పూనావాలా.
తమ కంపెనీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండటం ఒక చారిత్రక ఘట్టమని వెల్లడించారు అదర్ పూనావాలా. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను చేరవేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తొలి 100 మిలియన్ డోసుల (10 కోట్ల డోసులు) వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి రూ.200 చొప్పున విక్రయిస్తున్నామని వెల్లడించారు. తొలి 10 కోట్ల డోసుల తర్వాత ఒక్కో డోస్‌కు రూ.1000 లెక్కన ప్రైవేటు మార్కెట్‌లోకి తీసుకొస్తామన్నారు.
2021లో ఇది తమకు అతిపెద్ద సవాల్ అని, ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటామో చూడాలన్నారు. దేశంలోని సామాన్య ప్రజలు, అణగారిన వర్గాలు, నిరుపేదలు, వైద్యసిబ్బందికి తమ వంతు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీరమ్ సీఈవో తెలిపారు.