బండి..ఓ పొలిటికల్ టూరిస్ట్: మంత్రి పువ్వాడ

156
puvvada
- Advertisement -

త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరంగల్‌, ఖమ్మం నగరాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో పర్యటించిన బండి సంజయ్‌ టీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ‌్యలు చేశారు.

బండి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బండి సంజయ్‌‌ను బత్తాయితో పోల్చి మరీ ఎద్దేవా చేశారు. బండి ఓ పొలిటికల్ టూరిస్ట్ అని ఎన్నికలప్పుడు వచ్చి పోతుంటారని తీసిపడేశారు. టీఆర్ఎస్‌ నేతలకు బీజేపీ వ్యాక్సిన్ కనిపెట్టిందన్న బండి సంజయ్ వ్యాఖ‌్యలకు కూడా మంత్రి పువ్వాడ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. అయినా ఖమ్మం ప్రజలకు నిరోధక శక్తి ఎక్కువగా ఉందని ఇక్కడ ఎలాంటి వ్యాక్సిన్లు పని చేయవంటూ బండికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు పువ్వాడ. అంతే కాదు నువ్వు నాకు వ్యాక్సిన్ ఇవ్వడం కాదు..నేనే నీకు వ్యాక్సిన్ ఇచ్చా అంటూ విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లి డివిజన్‌లో ఉన్న ఏడు కార్పొరేటర్‌ సీట్లల్లో ఆరింటిని కైవసం చేసుకొని బండి సంజయ్‌కు నేనే అక్కడ వ్యాక్సిన్‌ వేశానన్నారు. వ్యాక్సిన్‌ నాకు ఇవ్వడం కాదు.. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో నా వ్యాక్సిన్‌ ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తా బిడ్డా’ అని సంజయ్‌ను ఉద్దేశిస్తూ పువ్వాడ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

కార్పొరేషన్‌ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రాబట్టేందుకు బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు ఆడుతున్నారని పువ్వాడ ఫైర్ అయ్యారు. రాజకీయ టూరిస్టుల మాటలను ఖమ్మం ప్రజలు నమ్మబోరని పువ్వాడ స్పష్టం చేశారు. ఇక మమతా మెడికల్ కాలేజీపై విచారణ జరిపిస్తానన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి పువ్వాడ స్పందించారు. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పై, మా మమతా మెడికల్‌ కళాశాలపై విచారణ జరిపిస్తా అని మాటలు పేలావు. ఇప్పుడు కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది. దమ్ముంటే నాపై విచారణ చేయించు.. నేను సిద్ధంగా ఉన్నా పువ్వాడ బండికి సవాల్ విసిరారు. అసలు ఖమ్మంలో మాకు ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీఅని, బీజేపీ మాకు పోటీయే కాదని అన్నారు. . ఖమ్మంకు స్మార్ట్‌సిటీ ప్రకటించాలని బీజేపీ ప్రభుత్వానికి అడిగితే స్పందించలేదని.. అలాంటి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని మంత్రి ప్రశ్నించారు. మొత్తంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి పువ్వాడ గట్టిగా తిప్పికొట్టారనే చెప్పాలి. పువ్వాడ సవాల్‌పై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -